ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ(ED) కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు విచారణకు హాజరు కాలేనని, 15 వస్తానని ఈడీకి కవిత రిక్వెస్ట్ లెటర్ రాశారు. తాను చట్టంపై నమ్మకంతో దర్యాప్తుకు సహకరిస్తా.. కానీ ధర్నా ఉన్న కారణంగా విచారణకు హాజరవ్వాలా లేదా అనేది న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. తాజాగా.. 10న ఢిల్లీ(Delhi)లో ధర్నా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని..ఈ కారణంగా విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. అయితే గతంలో కూడా సీబీఐ విచారణ సమయంలో కూడా కవిత(MLC Kavitha) ఇలాగే లేఖ రాయగా సీబీఐ కొన్నిరోజుల ఛాన్స్ ఇచ్చింది. మరి కవిత లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also: MLC కవితకు ఈడీ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే!
Follow us on: Google News