Money seized :మునుగోడుకు తరలిస్తుండగా పట్టుబడిన డబ్బు

-

Money seized :మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తెలంగాణలో విరివిగా భారీ స్థాయిలో డబ్బు పట్టుబడుతూనే ఉంది. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో పంచేందుకు తీసుకువెళ్తున్న రూ.89.91 లక్షల నగదు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడుకు భారీ స్థాయిలో డబ్బును తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న నగదు పట్టుబడగా.. తరలిస్తున్న వ్యక్తి కడారి శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇతడు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ వ్యక్తిగత సహాయకుడు జనార్థన్‌ డ్రైవర్‌గా గుర్తించారు. పట్టుబడిన నగదును జూబ్లీహిల్స్‌లో ఉన్న త్రిపుర కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి మునుగోడుకు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Read also: పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)పై ఐపీఎస్ అధికారుల సంఘం...

Parliament | అదానీ ఎఫెక్ట్.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా..

అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament)...