బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) కవిత కాళ్ల దగ్గర ధారపోస్తున్నాడని మండిపడ్డారు. బాల్కొండలో సర్కార్ కట్టిన బ్రిడ్జిలో కవితకు వాటా వెళ్తోందని అర్వింద్ కీలక ఆరోపణలు చేశారు. అంతేగాక, అక్కడ ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రోడ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్లు శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో రూ.5 వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.