MS Dhoni Birthday |తెలుగు రాష్ట్రాల్లో ధోనీ క్రేజ్.. బర్త్ డే స్పెషల్‌గా భారీ కటౌట్లు!

-

MS Dhoni Birthday | మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఆయన క్రేజ్ గురించి ఏమాత్రం తగ్గలేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక భారత జట్టుకు ధోని అందించిన సేవలు అజరామరం. ధనాధన్‌ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ధోనికి అభిమానులున్నారు. కాగా శుక్రవారం (జులై 7) మిస్టర్ కూల్‌ పుట్టిన రోజు.

- Advertisement -

ఈ సందర్భంగా అతని పుట్టిన రోజు(MS Dhoni Birthday)ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు రెడీ అయ్యారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోని బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 52 అడుగుల ధోనీ భారీ కటౌట్‌(Dhoni Cutout)ను ఏర్పాటుచేశారు. ధోని బర్త్‌డే సందర్భంగా శుక్రవారం దీనిని ఆవిష్కరించనున్నారు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోని బ్యాట్‌ పట్టుకుని క్రీజులోకి వస్తోన్న పోజుతో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఏకంగా 77 అడుగుల ధోని భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు.

Read Also:
1. భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లీకి మళ్లీ నిరాశే!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...