Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరిగింది. ఈ నెల 3న ఉప ఎన్నిక పోలీంగ్ జరిగింది. ఈ ఎన్నికను రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా విషయం తెలిసిందే..
ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేస్తారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ జరగుతుంది. అయితే ఈ కౌంటింగ్ కోసం 23 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్లు లెక్కింపు విధుల్లో 250 మంది సిబ్బంది, లెక్కింపు కోసం 100 మంది, ఇతర కార్యకలాపాలకు 150మంది సిబ్బంది వున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక బలగాలతో స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి
పోస్టల్ బ్యాలెట్ కౌంటీంగ్‌లో టీఆర్‌ఎస్ ముందంజలో దుసుకు పోయింది. 686 పోస్టల్ బ్యాలెట్‌ల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 8.50కి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224, బీఎస్సీ-10, ఇతరులకు 88 ఓట్లు పోల్ అయ్యాయి.