Munugode Bypoll :మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసి, నామినేషన్ల పరిశీలన పూర్తయిన విషయం తెలిసిందే.. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. ఈనేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మరింది. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి గ్రామంలో తిరుగుతూ.. ప్రచారాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్, అధికారం కోసం పోరాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అదిపత్యన్ని చాటుకునేందుకు దూకుడు పెంచాయి. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి వంటి ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్‌గా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపటి నుంచి మునుగోడులో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం మునుగోడుకు బయలుదేరి రేపటి నుంచి 12 రోజుల పాటు రోడ్ షోలతో ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడైన లక్ష్మణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని సమచారం.
కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే.. దూకుడుగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ఎవరి వ్యూహాలతో వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కానీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అదే జోష్‌తో మునుగోడులోను గెలిచేందుకు కాషాయదళం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా గెలిచి తమ సత్తా చాటుకుంటుందో లేదో తెలియాలంటే నవంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే.