మంత్రి హరీష్ రావుని గద్దె దించుతా.. మైనంపల్లి సంచలన శపథం

-

సీఎం కేసీఆర్ మరికాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumanth Rao) వ్యవహారం కలకలం పార్టీ వర్గాల్లో రేపుతోంది. అకస్మాత్తుగా ఆయన సొంత పార్టీ నేత హరీష్ రావు పై రివర్స్ అయ్యారు. మంత్రి హరీష్ రావును గద్దె దించే వరకు నిద్రపోను అంటూ వెంకటేశ్వర స్వామి పై ప్రమాణం చేసి మరియు శపధం చేశారు. మీడియా ముఖంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మైనంపల్లి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumanth Rao) మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు(Harish Rao) సిద్దిపేట ను డెవలప్ చేస్తూ, మెదక్ ను కీప్ లా చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రబ్బరు చెప్పులు, ట్రంక్ పెట్టె పట్టుకుని వెలమ హాస్టల్ కి వచ్చిన హరీష్ రావు.. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో గమనించాలని సూచించారు. మెదక్ లో నా తనయుడు, మల్కాజిగిరి(Malkajgiri)లో నేను పోటీ చేసి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు టైం లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట(Siddipet) పై కాన్సన్ట్రేట్ చేస్తానని, హరీష్ రావును గద్దె దించుతానని సవాల్ విసిరారు.

మైనంపల్లి హనుమంతరావు మాటిస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటాడని, హరీష్ రావును గద్దె దించుతానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికాసేపట్లో బిఆర్ఎస్ తొలి జాబితా విడుదల కానుంది. ఈ క్రమంలో మైనంపల్లి హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: ట్విట్టర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భావోద్వేగ పోస్ట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...