Nampalli magistrate grants bail to ys sharmila:వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. షర్మిలకు రిమాండ్ విధించాలని కోర్టుకు విన్నవించారు. తమ క్లయింట్‌పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారనీ, శాంతియుతంగా నిరసన తెలపటానికి వెళ్తే, అక్రమంగా అరెస్టు చేశారంటూ షర్మిల తరఫు న్యాయవాదులు పోలీసులు అరెస్టు చేసిన తీరును తప్పుబట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, షర్మిలకు వ్యక్తిగత పూచీకత్తుతో కూడిన బెయిల్‌ను మంజారు చేసింది
- Advertisement -