మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రరెసిడెంట్ కేటీఆర్(KTR) దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ సహా నలుగు సాక్ష్యులు బాల్క సుమన్, తుల ఉమ, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్‌ల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించింది కోర్డు. అక్టోబర్ 18న వారు తమ స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజుకు తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా నటుడు నాగార్జున దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులిచ్చింది. ఈ నెల 21 లోగా కొండా సురేఖ.. ఈ కేసుపై తన వివరణ ఇవ్వాలని న్యాయస్థానం కోరింది.
ఇదిలా ఉంటే.. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తన వ్యాఖ్యలతో తన పురువు తీశారంటూ కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ‘‘నా పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించి నా, నా కుటుంబ పరువను రోడ్డుకీడ్చారు. రాజకీయ లబ్ధి కోసమే ఆమె ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేశారు. బీఎస్ఎస్ సెక్షన్ 356 కింద ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు.