Nanda Kumar : పూజల కోసమే ఫాంహౌస్‌కు వెళ్ళాం

-

Nanda Kumar : మొయినాబాద్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో భారీగా నగదు పట్టుకున్న నేపథ్యంలో నిందితుల్లో నందకుమార్ మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్‌లో పూజల కోసం మాత్రమే వచ్చామన్నారు. ఎమ్మెల్యే‌ల కొనుగోలు అంశం‌లో వాస్తవం లేదని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు మాకు తెలియదని… సింహ‌యాజి స్వామిజీతో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికి మాత్రమే ఫామౌస్‌కు వెళ్ళామని వివరించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.‘‘ ఏ స్కాం మాకు తెలియదు. న్యాయాన్ని నమ్ముతున్నాం. న్యాయ స్థానంలో న్యాయం గెలిచింది. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెళ్లాడిస్తా.’’ అని నందకుమార్ (Nanda Kumar) పేర్కొన్నారు.

- Advertisement -

ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌, సింహయాజులు, విష్ణువర్ధన్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేసి.. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన విషయం తెలిసిందే… అయితే ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించడంతో నంద కుమార్‌, సింహయాజులు, విష్ణువర్థన్‌రెడ్డిలను విడుదల చేశారు.

Read also: మునుగోడు ఉప ఎన్నిక మాజీ రిటర్నింగ్ అధికారి సస్పెండ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...