Naveen Murder Case |నవీన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు

0
Naveen Murder Case

Naveen Murder Case |బీటెక్ స్టూడెంట్ నవీన్ మర్డర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన ప్రియురాలిను నవీన్ ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో హరిహర కృష్ణ అనే వ్యక్తి అత్యంత దారుణంగా నవీన్‌ను హత్య చేశాడు. అనంతరం గుండెతో పాటు నవీన్ శరీర భాగాలను బయటకు తీసి ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు. అయితే, ఈ హత్య కేసులో హరిహర కృష్ణ ప్రియురాలి పాత్ర కూడా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. తాజాగా.. ఆమె పాత్రపై రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర ప్రియురాలు ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని క్షుణ్నంగా పరిశీలించారు.

Naveen Murder Case |ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ.. హత్య కేసులో అమ్మాయి పాత్ర ఉందని ఇప్పటివరకూ ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా హరిహరకృష్ణకు సహకరించిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కచ్చితంగా శిక్షపడేలా చూస్తాం. హరహర చేసిన పని నీచమైన పని.. ఇది మనుషులు చేసే పని కానే కాదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకా ఎలాంటి వివరాలు వెల్లడించలేము అని సీపీ చౌహాన్ వెల్లడించారు.

Read Also: హైదరాబాద్‌లో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్.. ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్!

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here