బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Durgam Chinnaiah) తనను లైంగికగా వేధిస్తున్నారని కొన్ని నెలలుగా శేజల్ అనే యువతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఢిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్(NCW)కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. 15 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. కాగా అరిజన్ డెయిరీ విషయమై బెల్లంపల్లి ఎమ్మల్యే చిన్నయ్య(Durgam Chinnaiah)ను ఆశ్రయించామని.. అప్పటి నుంచి ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శేజల్ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదుచేసింది. అయితే స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీ వెళ్లింది. అక్కడ తెలంగాణ భవన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మహిళా కమిషన్ షాక్
-