New Year Celebrations -Hyderabad Metro to be functional till 1 am on Jan 1: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న మెట్రో రైలు టైమింగ్స్ పొడిగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రాత్రి ఒంటిగంటకు మొదటి స్టేషన్ నుండి చివరి ట్రైన్ బయలుదేరనుంది. 2గంటల వరకు చివరి గమ్యం చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా మద్యం తాగి పట్టుబడకుండా, డ్రంక్ డ్రైవ్ లో దొరకకుండా మెట్రో రైలు సమయం పొడిగించినట్టు అధికారులు వెల్లడించారు. కానీ, తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు మెట్రో అధికారులు.