New year traffic alert: ట్రాఫిక్ ఆంక్షలు ఉండే హైదరాబాద్ రూట్స్ ఇవే!

-

New year traffic alert – Traffic Restrictions in Hyderabad for New Year Celebrations: హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈరోజు రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్స్ మూసివేయనున్నట్లు తెలిపారు. అందులో బేగంపేట, లంగర్ హౌస్ వంతెనలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పివిఆర్ ఎక్సప్రెస్ వే పై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అనుమతి ఉండదని.. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాళ్ళు టికెట్ చూపిస్తే అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు.  ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. నగరం మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మద్యం సేవించి దొరికితే రూ. 10 వేలు ఫైన్. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను  నగరంలోకి అనుమతి లేదు.

- Advertisement -

ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్ భవన్ మీదుగా మళ్లించనున్నారు. మింట్ కాంపౌండ్ రోడ్డు ను మూసివేయనున్నారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ మీదుగా.. సికింద్రాబాబ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు. లిబర్టీ కూడలి, అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వద్ద రూట్ డైవర్ట్ చేయనున్నారు.

Read Also:

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...