Telangana Assembly | అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు

-

Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

Telangana Assembly | అయితే మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు సర్జరీ జరగడంతో ఆయన సభకు హాజరుకాలేదు. అలాగే కేసీఆర్‌కు తోడుగా ఆసుపత్రిలో ఉన్నందున కేటీఆర్(KTR) కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఇక బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) ఉండటంతో ఆయన ముందు ప్రమాణ స్వీకారం చేయమని తెపారు. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో 119 మంది ఎమ్మెల్యేల్లో 109 మంది మాత్రమే ప్రమాణం చేశారు.
Read Also: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. వివరాలు ఇవే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...