Pushpa 2 మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు.. ఏమనంటే..

-

అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన(Rashmika) జంటగా నటించిన సినిమా ‘Pushpa 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు నిర్వహించారు. కాగా హైదరాబాద్ ఎక్స్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో మాత్రం ఈ ప్రీమియర్ షో సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.

- Advertisement -

అక్కడకు Pushpa 2 టీంతో  అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరిణించింది. ఆమె కుమార్ శ్రీతేజ.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా న్యాయవాది రవికుమార్.. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్‌సీ(NHRC) విచారణకు ఆదేశిచ్చింది.

‘‘సంధ్య థియేటర్(Sandhya Theatre) యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడమే కాకుండా రద్దీని నియంత్రించడంలో కూడా విఫలమైంది. అల్లు అర్జున్‌ను చూడటం కోసం ఎగబడ్డ ప్రేక్షకులను కట్టడి చేయడంలో థియేటర్ యాజమాన్యం తీవ్రంగా విఫలం  కావడమే తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా. ఆమె కుమారుడు శ్రీతేజ.. ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతున్నాడు.

అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులకు బాధ్యులు రూ.5కోట్ల పరిహారం అందించాలి. తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఒక బాలుడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని న్యాయవాది రవి కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఝలక్.. బెనిఫిట్ షోలపై కీలక నిర్ణయం..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...