MLC Elections | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఇరువురు ఆ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు సీఈసీ సిద్ధమైంది.
Notification for MLC Elections :
జనవరి 18- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 19- నామినేషన్ల పరిశీలన
జనవరి 22- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
జనవరి 29- పోలింగ్, కౌంటింగ్
ఈ రెండు స్థానాలను ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశముంది. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు హస్తం నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు.