MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల పోలింగ్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు ఈ నాలుగు జిల్లాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఫిబ్రవరి 25 సాయంత్రం 4.00 గంటల నుండి ఫిబ్రవరి 27 సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం జరిగిందని అన్నారు.
MLC Elections | 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టి, ఎస్ ఎస్ టి, ఎంసీసీ, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్ ల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించే ఆయా జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఈ ప్రకటనలో వెల్లడించారు.