ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. మూడు మీటర్ల లోతు బురదలో కార్మికుల మృతదేహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పారు. అవన్నీ కూడా అబ్దపు వార్తలేనని వెల్లడించారు. వీటిని నమ్మొద్దని, కార్మికుల మృతదేమాలను గుర్తించడం అనేదీ ఏమీ జరగలేదని అన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.
SLBC | మృతదేహాలను గుర్తించారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ శుక్రవారం రాత్రి స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అదే విధంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురించే ముందు ఒకసారి నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పారు.