హైదరాబాద్‌పై మరోసారి ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

-

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని.. అందుకే ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించేందుకు గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం బిల్లును కూడా ప్రవేశ పెట్టారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

- Advertisement -

బీజేపీ, ఆప్‌లు తమ రాజకీయ పోరాటాన్ని సభ వెలుపల చూసుకుంటే బాగుంటుందని ఓవైసీ సూచించారు. గతంలో జమ్ముకశ్మీర్ పునర్విభజన సందర్బంగా కూడా ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ముంబైలను కేంద్రం యూటీలుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. అయితే ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేదా మరే ఇతర నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రం అనుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఓవైసీ ఇటువంటి వ్యాఖ్యలే చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...