బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy).. ప్రభుత్వం దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ శనివారం హుజురాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆందోళనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. ఆయన అస్వస్థతకి గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Padi Kaushik Reddy | హుజురాబాద్ లో టెన్షన్ టెన్షన్.. స్పృహ తప్పిన ఎమ్మెల్యే పాడి కౌశిక్
-