బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy), సుధీర్ రెడ్డి(Sudhir Reddy) తమిళనాడులోని మధురై కోర్టులో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం వారిద్దరు అక్కడి కోర్టులో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వారు కోర్టుకు ఎందుకు వెళ్లారనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. అయితే రేవంత్(Revanth Reddy) నియామకం కోసం మాణిక్కం ఠాగూర్(Manickam Tagore) రూ.500కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy), సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు తీవ్రంగా పరిగణించిన ఆయన.. మధురై కోర్టు(Madurai Court)లో వారిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని కోర్టు చాలా సార్లు సమన్లు ఇచ్చింది. అయితే ఇద్దరు ఆ నోటీసులను పట్టించుకోకపోవంతో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీంతో చేసేదేమీ లేక ఇద్దరు హుటాహుటిన ఆ న్యాయస్థానం న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో ఇరువురు కోర్టుకు హాజరైన ఫొటోలను మాణిక్కం ఠాగూర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేసిన ఎవరినీ వదిలేదని.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.