ఐటీ దాడులపై భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు మీద సౌత్ ఆఫ్రికా(Soth Africa)లో గనులున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అందంతా అవాస్తవం అని తెలిపారు. వేరే ఉద్దేశంతోనే ఐటీ దాడులు నిర్వహించి.. తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయన్నారు. తనిఖీల్లో భాగంగా అధికారులకు అన్నివిధాలుగా సహకరించానని చెప్పారు. తన బంధువుల ఇళ్లలో పలు కీలక డ్యాకుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనే ప్రచారాన్ని కూడా కొట్టిపారేశారు. అయితే శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) ఇంట్లో ఐటీ దాడులు పూర్తైన అనంతరం తొలిసారిగా ఆయన భువనగిరికి వచ్చారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
Pailla Shekar Reddy | దక్షిణాఫ్రికాలో ఆస్తులపై స్పందించిన BRS MLA
-
- Advertisement -