బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందడంతో బయటకు విడుదల చేశారు. మీడియాతో మాట్లాడకూడదని షరతులు విధించడంతో చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి బయటకు రాగానే నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇక ప్రతి నెల 1, 16వ తేదీల్లో జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ప్రశాంత్ జైలు నుంచి విడుదల కావడంతో బిగ్‌బాస్ కంటెంస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ప్రశాంత్(Pallavi Prashanth) అభిమానులు ధ్వంసం చేసిన కేసులో పోలీసులు నాలుగు రోజుల క్రితం అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.