మంత్రివర్గ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahender Reddy)ని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సమయం ఇవ్వాలంటూ రాజ్‌భవన్‌కు సోమవారమే ప్రభుత్వం రిక్వెస్టు పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం ఉందనే ఉద్దేశంతో బుధవారం ఖరారు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తయి చేసింది. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు లీకులు వెలువడ్డాయి. స్వయంగా పట్నం మహేందర్ రెడ్డే మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా టైమ్ గురించి ప్రస్తావించారు. కానీ రాజ్‌భవన్ నుంచి ఇప్పటివరకూ నిర్దిష్ట అపాయింట్‌మెంట్ ఫిక్స్ కాలేదు. గవర్నర్ డెంటల్ సమస్యతో బాధపడుతున్నందున రెండు రోజులు ఆలస్యం కావచ్చని రాజ్‌భవన్ వర్గాల సమాచారం.
పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి.. రేపే ప్రమాణ స్వీకారం!
-