ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పవన్ కల్యాణ్, తారక్

-

దివంగత సీఎం ఎన్టీఆర్(NTR) శత జయంతి వేడుకలు టీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈనెల 20న కూకట్‌పల్లి హాసింగ్ బోర్డులో ఉన్న కైతలాపూర్ మైదానంలో సాయంత్రం 5గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సభకు సభకు అగ్ర హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ టీడీ జనార్దన్ తెలిపారు. అన్నగారి మనవడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), స్టార్ హీరోలు పవన్ కల్యాణ్(Pawan Kalyan), అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్(Prabhas), వెంకటేశ్(Venkatesh), కల్యాణ్ రామ్(Kalyan Ram), కన్నడ సినీ హీరో శివ రాజకుమార్, జయప్రద, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, జీ. ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్, సుమన్ ఈ సభలో పాల్గొనున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారం ఏచూరీ, డీ.రాజా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరీ హాజరుకానున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ‘శకపురుషుడు’ పేరుతో ఓ ప్రత్యేక సంచికను కూడా సభలో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. తొలి సభను శత జయంతి కమిటీ విజయవాడలో నిర్వహించగా.. రెండో సభను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు.

Read Also: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...