Jagtial | రెండు తలల కోడిపిల్ల.. ఎగబడుతున్న జనం

-

జగిత్యాల(Jagtial) జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామం కొండగట్టు వార్డులో ఓ విచిత్రం జరిగింది. సిక్కుల శారద అనే మహిళ పెంచుకుంటున్న కోడిపెట్ట పెట్టిన గుడ్డు నుంచి ఇటీవల పిల్ల బయటకు వచ్చింది. ఇందులో విచిత్రం ఏముందనుకుంటున్నారా.. ఆ పిల్ల రెండు తలలతో(Two Headed Chick) పుట్టింది. ప్రస్తుతం ఈ విషయంలో స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో కోడిపిల్లను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఎగబడుతున్నారు. పొదిగిన గుడ్డునుండి రెండు తలలతో కోడిపిల్ల బయటకు రావడం చూసి శారదా ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. సంవత్సరాలుగా కోళ్లు పెంచుకుంటున్నామని కానీ ఈ రెండు తలల కోడి జన్మించడం మొదటిసారని తెలిపారు.

Read Also: ‘అవతార్’కు నో చెప్పడానికి అదొక్కటే కారణం: గోవింద
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manickam Tagore | ఈడీ పెంపుడు కుక్క… కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్...

Govinda | ‘అవతార్’కు నో చెప్పడానికి అదొక్కటే కారణం: గోవింద

Govinda - Avatar | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ‘అవతార్’....