PM Modi |సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలులో విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోడీ. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని.. దీనివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని మోడీ చెప్పారు.
అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబం పాలన అవినీతిని పెంచిపోషిస్తుందన్నారు. సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారు.. అన్ని విషయాల్లో వారికి కుటుంబ స్వార్థమే కావాలంటూ మోడీ(PM Modi) ఫైర్ అయ్యారు. ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారు.. అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా వద్దా? అంటూ ప్రజలను కోరారు. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి.. కోర్టుకు వెళ్లారు, అక్కడా వారికి షాక్ తగిలిందంటూ విమర్వించారు. తెలంగాణ ఏర్పడినప్పుడే కేంద్రంలో NDA ప్రభుత్వం కూడా వచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను కేంద్రం తీసుకుందన్నదని సెటైర్లు వేశారు.
Read Also: టెన్త్ పేపర్ లీక్ కేసు: డిబార్ అయిన విద్యార్థి హరీశ్‌కు హైకోర్టులో ఊరట
Follow us on: Google News, Koo, Twitter