PM Modi: తెలంగాణలో కమలం వికసిస్తుంది.. ప్రజలకు మాటిస్తున్న

-

PM Modi key comments in Begumpet sabha fire on trs: తెలంగాణలో కమలం వికసిస్తుందని మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి భరోసా ఇచ్చారని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మునుగోడులో కమల వికాసం కనిపించిందని.. ఒక అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయిందన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదన్నారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపారని, తెలంగాణ కార్యకర్తలు బలమైన శక్తులని వారు ఎవరికీ భయపడరని పేర్కొన్నారు. రాష్ట్రంలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి కుటుంబం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, కుటుంబ పాలన, అవినీతి దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు లాంటివని నేను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ‘‘ప్రజలకు మాటిస్తున్నా. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధం. బీజేపీ కార్యకర్తలంతా బూత్ స్థాయికి వెళ్లి.. కేంద్రం అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించాలి‘‘ అని PM Modi పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...