మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్(Veldi Hariprasad)ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రశంసించారు. చేనేత మగ్గంపై పలు ఆవిష్కరణలు చేయడంతో పాటు జీ20 లోగోని నేసినందుకు ప్రధాని అభినందించారు. కాగా, హరిప్రసాద్ గతంలో చేనేత మగ్గంపై అనేక ప్రయోగాలు చేశాడు. బుల్లి మరమగ్గాలు, అగ్గిపెట్టలో ఇమిడే వెండి చీర, దబ్బనం సూదిలో దూరే చీరలు, కేసీఆర్, కేటీఆర్, ముఖచిత్రాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ గీతం, భారతదేశ ముఖచిత్రం ఒకే వస్త్రం పై వచ్చే విధంగా నేశారు. అలాగే మహాత్మా గాంధీజీ 150వ పుట్టినరోజుకు గాంధీజీ నూలు వాడుతున్న విధానం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటో తో నేసిన వస్త్రం, రాజన్న సిరిపట్టు నామ కరణం చేశారు. తాజాగా.. హరిప్రసాద్(Veldi Hariprasad) వేసిన జీ20 లోగోపై ప్రధాని నుంచి అభినందనలు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఆయన్ను అభినందిస్తున్నారు.