నకిలీ నోట్లు(Fake Currency) తయారుచేసే ముఠాలపై పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో భారీ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్(Shamshabad) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావు ముఠాగా ఏర్పడి రూ. 50, 100, 200, 500 ఫేక్ నోట్లను సొంతంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.11లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రూరల్ ప్రాంతాలే లక్ష్యంగా నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రింట్ చేసిన దొంగ నోట్ల(Fake Currency)ను ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపుతున్నట్లు పేర్కొన్నారు.
Read Also: కర్ణాటక ఎన్నికల్లో రికార్డు సృష్టించిన కురువృద్ధుడు
Follow us on: Google News, Koo, Twitter