Padi Kaushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని బంజారా హిల్స్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. సీఐని విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న కేసులో భాగంగా గురువారం ఉదయం ఆయనను ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం పోలీసులు ఆయన నివాసానికి చేరుకోగా అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను లోపలికి రాకుండా కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు.

- Advertisement -

అదే సమయంలో అక్కడికి మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సహా పలువురు ఇతర నేతలు కూడా వచ్చారు. ఈ క్రమంలో హరీష్ రావు.. కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. కాగా ఎట్టకేలకు కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతుందని పేర్కొంటూ ఫిర్యాదు ఇవ్వడం కోసం బుధవారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బయటకు వెళ్తున్నారు. అది గమనించిన కౌశిక్ రెడ్డి.. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాత వెళ్లాలని డిమాండ్ చేశారు. తాను ఒక అర్జెంట్ పనిపైన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఆయన ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ చెప్పారు. దాంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సీఐ వెనక్కు వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం తనను తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి సహా ఆయన అనుచరులపై సీఐ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ సహా 20మంది ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 57, 126(2), 132, 224, 333, 451(3), 191(2), r/w 190, r/w 3(5) సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Read Also: ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...