Manchu Manoj | నాకా నమ్మకం ఉంది: మనోజ్

-

నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ విచారణలో పాల్గొన్న మనోజ్(Manchu Manoj).. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు. నిన్నటి వరకు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన మనోజ్.. ఈరోజు తనకు పోలీసు వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. తనకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని మనోజ్ చెప్పారు. పోలీసులు విచారణ అనంతరం అతను మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

‘‘మేము అందరం సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటాము. ఎక్కువగా మా ఇంటివద్ద పబ్లిక్ గ్యదరింగ్ ఉండకూడని పోలిసులు సూచించారు. సమస్య పరిష్కారం అయితే అందరికీ సంతోషం. మా అన్న విష్ణు(Manchu Vishnu) ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి అది అవాస్తవం అని Manchu Manoj అన్నారు.

చంద్రగిరి పేద ప్రజల కోసం నేను పోరాడుతున్న. వినయ్ అనే వ్యక్తి విద్య నికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడు. నేను మా నాన్నగారికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. నాన్నకి ఈ విషయాలు అన్నీ తెలియదు. నేను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’’ అని తెలిపారు.

Read Also: మోహన్ బాబు‌కు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...