బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌తో కేసు నమోదైంది. దీంతో సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు రెండు రోజుల నుంచి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులసు వెల్లడించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఇంట్లో కూడా లేకపోవటంతో ప్రత్యేక బృందాలతో సుమన్ కోసం గాలిస్తున్నారు.
కాగా ఇటీవల మంచిర్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని రండగాడు, హౌలే గాడు అంటూ చెత్త నా..కు అంటూ ఊగిపోయారు. అంతే కాకుండా చెప్పుతో కొట్టినా తప్పులేదని చెప్పు చూపించారు. సంస్కారం అడొచ్చి ఆగుతున్నానని.. లేదంటే మరోలా ఉండేదని ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.
సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సుమన్(Balka Suman) దిష్టిబొమ్మలు దహనం చేసిన నిరసన వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే నాలుక చీరుస్తామని హెచ్చరించారు.