Padi Kaushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. అందుకే..

-

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9న దళితబంధు రెండో విడత డబ్బులు వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేసిన ధర్నాకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. పాడి కౌశిక్ రెడ్డి.. నవంబర్ 9న అనుమతులు లేకుండా ధర్నా చేసిన కారణంగానే ఆయన సహా పలువురు ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 35(3) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ధర్నా చేసిన 15 రోజుల తర్వాత పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉంది. ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ నోటీసులు ఇవ్వడం జరిగిందని, కౌశిక్ రెడ్డిని అణచివేయడానికి, జైలుకు పంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy ).. ప్రభుత్వం దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ నవంబర్ 9న హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆందోళనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

దీంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. ఆయన అస్వస్థతకి గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్(KTR), హరీష్‌ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

Read Also: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అంటున్న ‘లక్కీ భాస్కర్’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...