ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కోమటిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే వీరిద్దరితో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయి సమాలోచనలు జరిపారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని సిద్ధమయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.