భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆమె రాక నేపథ్యంలో పలు ట్రాఫిక్ మల్లింపులను కూడా పోలీసులు చేపట్టారు. మరి కాసేపట్లో ఆమె హైదరాబాద్‌కు విచ్చేయనున్నారు. తన హైదరాబాద్ పర్యటనలో ముర్ము.. పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్ర 6 గంటలకు ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలకనుననారు. మినిస్టర్ ఇన్ వెయిటెంగ్‌గా రెండు రోజుల పాటు రాష్ట్రపతి కార్యక్రమాలను మంత్రి సీతక్క దగ్గరుండి చూసుకోనున్నారు.
రాష్ట్రపతి Droupadi Murmu పర్యటన షెడ్యూల్ ఇదే..
ఈరోజు సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న రాష్ట్రపతి.
బేగంపేట విమానాశ్రయం నుంచి 6:20 గంటలకు రాజ్ భవన్ వెళ్లనున్న రాష్ట్రపతి.
7:20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం(Koti Deepotsavam) కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్రపతి.
7:55 గంటలకు కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగం.
8:35 గంటలకు రాజ్ భవన్ చేరుకొని, అక్కడే బస చేయనున్న రాష్ట్రపతి.
రేపు ఉదయం 9:55 గంటలకు రాజ్ భవన్ నుంచి శిల్ప కళా వేదికకు వెళ్లనున్న రాష్ట్రపతి.
10-30 నుంచి 11-30 వరకు లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగం.
11-30 శిల్ప కళ వేదిక నుంచి బయలుదేరి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లనున్న రాష్ట్రపతి.
బేగంపేట విమానాశ్రయం నుంచి 12- 05 నిమిషాలకు ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్రపతి.