President Droupadi Murmu Leaves for Delhi after concluding Five days Telangana visit: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ కి బయలుదేరనున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని బొల్లారం లోని రాష్ట్రపతి భవన్ కి శీతాకాల విడిది కోసం వచ్చారు. ఐదు రోజుల పర్యటనను ముగించుకున్న రాష్ట్రపతి నేడు యాదాద్రి లక్ష్మి నరసింహుడిని దర్శించుకున్నారు. కాగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ఇస్తున్న విందు కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ పోచారం, మంత్రులు, బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ప్రజా గాయకుడూ గద్దర్ కూడా హాజరయ్యారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు పలికారు.