PM Modi: గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ.. నల్లబెలూన్లతో నిరసన

-

Protest with black balloons to protest Ts PM Modi visit: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు నేడు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. ‘‘గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. `మోడీ ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చినట్టే ఇచ్చి అనంతరం వాటిని ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. మోడీని అడ్డుకునేందుకు హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్తున్న ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం, ఇతర నేతలను పోలీసులు సిద్దిపేట వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...