మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) అంశానికి సంబంధించి బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
- Advertisement -
అతని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఐపీసీ 120బీ, 386, 409 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. వారు తమ పాలన సమయంలో తన ఫోన్‌ను ట్యాప్(Phone Tapping Case) చేశారని చక్రధర్‌గౌడ్ ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హరీష్ రావు, రాధాకిషన్‌కు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతోంది.