మహిళలపై వేధింపులు.. ప్రభుత్వానికి MLA రఘునందన్ రావు సూటి ప్రశ్న

-

రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామం తాజా, మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఇవాళ రఘునందన్ రావు స్పందించారు.

- Advertisement -

నిధులు రాక అప్పుల బాధతో, అవమానం భరించలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపించారు. మహిళా బిల్లు, మహిళల పైన కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవితకు ఇవి కనిపించవా అని ప్రశ్నించారు. మహిళలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష.. పక్క రాష్ట్రంలో మహిళలకు ఏదైనా అయితే స్పందించే అధికారి స్మితా సబర్వాల్, మహిళా కమిషనర్ సునీత రెడ్డి ఎందుకు ఈ మౌనం అని నిలదీశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...