Rahul Gandhi: బీజేపీని పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ సమర్థించింది

-

Rahul Gandhi: బీజేపీ, టీఆర్‌ఎస్‌ వేరువేరు కాదనీ.. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. రెండు పార్టీలు కలిసే ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీని పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎన్నోసార్లు సమర్థించిందని రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం భారత్‌ జోడో యాత్రలో భాగంగా నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడిన రాహుల్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఈ రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నట్లు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు.

- Advertisement -

కేసీఆర్‌కు మోడీకు డైరెక్ట్‌ ఫోన్‌ లింక్‌ ఉందనీ.. ఇక్కడ కేసీఆర్‌ ఫోన్‌ చేసిన వెంటనే.. అక్కడ మోదీ స్పందిస్తారని ఆరోపించారు. దేశంలో యువతకు ఉద్యోగాలు లేవనీ.. ఇంజనీరింగ్‌ చేసిన వాళ్లు స్విగ్గీలో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మేసి.. ప్రైవేటుపరం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రెండు ప్రభుత్వాలు రైతులకు మేలు చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టి ఎప్పుడూ, ధరణి పోర్టల్‌ మీదే ఉంటుందనీ.. భూములు ఎక్కడున్నా ఆక్రమించడానికే చూస్తారని రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ఆరోపణలు గుప్పించారు.

జోడో యాత్ర సందర్భంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధిక రాహుల్‌ని కలిశారు. జోడో యాత్రకు తమ సంఘీభావం తెలుపుతున్నామని రాధిక ప్రకటించారు. తనను కలిసిన రాధికను రాహుల్‌ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కాగా, రాహుల్‌తో రోహిత్‌ తల్లి కలిసి జోడో యాత్రలో నడిచిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read also: నేడు, రేపు రాష్ట్రంలో కుండపోత వర్షాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...