Rahul Gandhi Resumed Telangana leg of Bharat Jodo Yatra to enter maharashtra later today: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ సందర్భంగా కామారెడ్డి మద్నూర్ మండలం మేనూరు వద్ద భారత్ జోడో గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలివస్తున్నారు. సభ అనంతరం తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర ముగిసి… పూరై మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -