వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సలహా ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar). ఓపిక.. నిబద్ధత.. క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయని హామీ ఇచ్చారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పుకొచ్చారాయన. మహేశ్వరం గట్టుపల్లిలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్‌కు మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా రాహుల్ గాంధీదేనన్నారు.
‘‘రాజీవ్ గాంధీ తరాలోనే రాహుల్ గాంధీ కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. ఏఐసీసీ(AICC) మహామహులు NSUI నుంచి వచ్చిన వారే. హిమాచల్ సీఎం, అరుణాచల్ మాజీ ముఖ్య మంత్రి వంటి నేతలు NSUI నుంచి వచ్చిన వారే. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని కావడం తథ్యం. దేశరాజకీయాల్లో ఆయన మార్క్ కనిపించడం ఖాయం’’ అని పేర్కొన్నారు Mahesh Kumar.