Rain Alert |తెలంగాణలో గత రెండు రోజులుగా పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం వుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనను జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, యాదాద్రి భువనపల్లి, హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్(Rain Alert) ప్రకటించారు. కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడుతున్న జనం తాజా వర్షాలతో కాస్త ఊరట పొందనున్నారు.
Read Also: వాళ్లు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు: భట్టి విక్రమార్క
Follow us on: Google News, Koo, Twitter