Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని.. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
Rain Alert | ఇప్పటికే పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు పడడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. అటు ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కొన్ని రోజులుగా ఎండల వేడికి అల్లాడుతున్న ప్రజలు వానలు కురుస్తుండటంతో కాస్త సేద తీరుతున్నారు.