Raj Gopal Reddy: టీఆర్ఎస్‌‌కు కమ్యూనిస్టు ఓట్లు కలిసి వచ్చాయి

-

Raj Gopal Reddy fires on kcr Munugode Bypoll Results: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మునుగోడు ఎన్నికల ఫలితల్లో కారు జోరు మీద దూసుకుపోతుంది. టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండటం పై బీజేపీ పోటీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌‌కు కమ్యూనిస్టు ఓట్లు కలిసి వచ్చాయన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్ముకు మునుగోడులో వామపక్ష నేతలు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు.

- Advertisement -

‘‘టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి 100 మందికి పైగా నన్ను ఓడించడానికి మోహరించారు. ఒక్కడినే కౌరవ సైన్యాన్ని ఎదిరించి పోరాడాను.’’ టీఆర్ఎస్ ఎన్నో ప్రలోభాలకు పాల్పడిందని.. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ నిధులు బ్యాంకు ఖాతాల్లో వేసి ప్రలోభపెట్టారని అన్నారు. టీఆర్ఎస్‌‌కు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తామని ప్రజలను బెదిరించారని అన్నారు.ప్రజల తరఫున అసెంబ్లీలో ఎంతో పోరాటం చేశానని.. ఫామ్‌హౌస్ పాలకులను, ప్రగతిభవన్‌ నేతలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చానని తెలిపారు.ఇది టీఆర్ఎస్ అధర్మ గెలుపు అని.. మునుగోడులో నైతికంగా విజయం నాదే అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...