Rajiv Yuva Vikasam | యువవికాసం స్కీమ్‌ మార్గదర్శకాలు విడుదల

-

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ పేరిట మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదేళ్ల వ్యవధిలో కుటుంబానికి ఒక్కసారే లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణాల్లో రూ. 2 లక్షలు, పల్లెల్లో రూ. 1.50 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబాలే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు (సదరం సర్టిఫికెట్ తప్పనిసరి) 5% రిజర్వేషన్ అమలవుతుందని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు, స్వయం ఉపాధిలో స్కిల్స్ ఉన్న యువతకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. స్వయం ఉపాధికి మొదటిసారి లబ్ధిపొందేవారికి కూడా ప్రయారిటీ ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) మార్గ‌ద‌ర్శ‌కాలు…

రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం స‌బ్సిడీ

రూ.ల‌క్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10%) మాఫీ

రూ.2 ల‌క్ష‌ల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ

గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 ల‌క్ష‌లు

అర్బ‌న్ ఏరియాలో వారి ఆదాయం రూ.2 ల‌క్ష‌లు

నాన్ అగ్రిక‌ల్చ‌ర్ యూనిట్ల‌కు 21-55 ఏండ్ల లోపు వారు అర్హులు

అగ్రిక‌ల్చ‌ర్ ద‌ర‌ఖాస్తుదారులకు 60 ఏండ్లు ఏజ్ లిమిట్

ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం.

Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. ఆ శాఖను వదులుకోనున్న రేవంత్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...