సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahankali) అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి(Rangam Bhavishyavani) వినిపించారు. ‘ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారు.
కావాల్సిన బలాన్ని ఇచ్చాను.. మీవెంటే నేను ఉంటా. వర్షాలు తప్పనిసరిగా వస్తాయి. మీరు భయపడవద్దు. ఆలస్యమైనా వానలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రంగం(Rangam Bhavishyavani) కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) పాల్గొన్నారు.
Read Also: ఇకపై అలా జరగడానికి వీళ్లేదు.. టీ-బీజేపీ నేతలకు నడ్డా స్వీట్ వార్నింగ్
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat