రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జరిగిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఇది పరువు హత్య అని అందరూ భావిస్తుందడగా ఇందులో ఆస్తి కోణం వెలుగు చూసింది. నాగమణిని సోదరుడు పరమేష్.. ఆస్తి కోసమే హతమార్చాడని స్థానికులు చెప్తున్నారు.
వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో అక్క, తమ్ముడికి కొంత కాలంగా వివాదం జరుగుతోందని, అందులో భాగంగానే నేడు హతమార్చి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రి లేకపోవడంతో నాగమణికి అన్నీ తానై తమ్ముడు ముందుకు నడిపించాడు. తన మొదటి వివాహం తర్వాత వారసత్వంగా వచ్చిన భూమిని నాగమణి.. తమ్ముడికి ఇచ్చేసింది.
Rangareddy | ఇప్పుడు శ్రీకాంత్‌ను రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ భూమిలో తనకు వాటా కావాలని తమ్ముడిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించిందని, దీంతో భూమి ఇచ్చే ఉద్దేశం లేని పరమేష్ సోమవారం ఉదయం దారికాచి.. స్కూటీపై వస్తున్న అక్కను కారుతో ఢీ కొట్టాడు. అనంతరం కిందపడిపోయిన నాగమణి(Nagamani)పై కొడవలితో దాడి చేసి హతమార్చాడని స్థానికులు వివరిస్తున్నారు. కాగా ఈ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.